జికా వైరస్ కలకలం.. మహారాష్ట్రకు కేంద్ర బృందం

ABN , First Publish Date - 2021-08-03T01:07:41+05:30 IST

మహారాష్ట్రలో ఇటీవల జికా వైరస్ తొలి కేసు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది.

జికా వైరస్ కలకలం.. మహారాష్ట్రకు కేంద్ర బృందం

ముంబై: మహారాష్ట్రలో ఇటీవల జికా వైరస్ తొలి కేసు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వైరస్ కట్టడిలో రాష్ట్రానికి సహాయకారిగా ఉండేందుకు తాజాగా ఓ నిపుణుల బృందాన్ని పంపించింది. ఈ వైరస్ కట్టడి కోసం కేంద్ర బృందం రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు,సలహాలు ఇవ్వనుంది. భారత్‌లో జికా వైరస్ కేసు వెలుగు చూసిన రెండో రాష్ట్రం మహారాష్ట్ర అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళ ఈ సమస్యతో పోరాడుతోంది.  కాగా.. మహారాష్ట్రలో పూణెకు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ జూలైలో జికా వైరస్ బారిన పడ్డారు. చికిత్స అనంతరం ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నారు. అదృష్టవశాత్తూ..ఆమె కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ బారిన పడలేదు. 

Updated Date - 2021-08-03T01:07:41+05:30 IST