యథావిధిగా కార్యకలాపాలు

ABN , First Publish Date - 2021-06-22T07:09:34+05:30 IST

ఒకవైపు కర్ఫ్యూ ఆంక్షల సడలింపు, మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖంతో అందరికీ ఉపశమనం దక్కినట్లైంది.

యథావిధిగా కార్యకలాపాలు
వాహనాలతో రద్దీగా ఉన్న ఒంగోలులోని ట్రంక్‌రోడ్డు

సాయంత్రం 6 వరకూ సడలింపులు

రాత్రిపూట పర్యవేక్షణ నామమాత్రం

ఒంగోలు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు కర్ఫ్యూ ఆంక్షల సడలింపు, మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖంతో అందరికీ ఉపశమనం దక్కినట్లైంది. పగటిపూట సడలింపు ఇవ్వడంతో ఇంచుమించు అన్నిరకాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 నుంచి కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంది. దీంతో జనసంచారం  పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో సోమవారం ఉదయం, సాయంత్రం  తేడా లేకుండా  రద్దీ అధికంగా కన్పించింది. ఆంక్షల సడలింపునకు తోడు పాజిటివ్‌ కేసులు గతంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం కూడా అందుకు కారణంగా కనిపిస్తోంది. 




Updated Date - 2021-06-22T07:09:34+05:30 IST