13 ఏళ్లకే టాటూ ఆర్టిస్టుగా..!

ABN , First Publish Date - 2021-04-08T05:03:05+05:30 IST

పదమూడేళ్ల వయస్సు పిల్లలంటే స్కూల్‌, ఇల్లు, ఆటలే లోకంగా ఉంటారు. కానీ సింగపూర్‌కు చెందిన లిలిత్‌ సియో మాత్రం 13 ఏళ్లకే మంచి పేరున్న టాటూ ఆర్టిస్టుగా గుర్తింపు సాధించారు. ఆ విశేషాలివి...

13 ఏళ్లకే టాటూ ఆర్టిస్టుగా..!

పదమూడేళ్ల వయస్సు పిల్లలంటే స్కూల్‌, ఇల్లు, ఆటలే లోకంగా ఉంటారు. కానీ సింగపూర్‌కు చెందిన లిలిత్‌ సియో మాత్రం 13 ఏళ్లకే మంచి పేరున్న టాటూ ఆర్టిస్టుగా గుర్తింపు సాధించారు. ఆ విశేషాలివి...

  • టాటూ వేయడమంటే మాటలు కాదు. ఏమాత్రం తేడా వచ్చినా టాటూ మొత్తం చెడిపోతుంది. కానీ లిలిత్‌ విషయంలో అలాంటి తప్పు ఎప్పుడూ జరగలేదు. లిలిత్‌ వాళ్ల నాన్న జోసెఫ్‌ సింగపూర్‌లో బాగా గుర్తింపు ఉన్న టాటూ ఆర్టిస్టు. తండ్రి నుంచి మెలకువలు నేర్చుకున్న లిలిత్‌ ఆయన బాటలోనే నడుస్తూ పేరు తెచ్చుకుంటోంది.
  • ‘‘రోజూ నాన్నతో కలిసి షాపుకు వెళ్లి టాటూ వేయడంలో మెలకువలు నేర్చుకున్నాను. వీకెండ్స్‌లో, స్కూల్‌కు సెలవులు ఉన్న సమయంలో నాన్నతో టాటూ షాప్‌కు వెళ్లేదాన్ని. అలా టాటూ వేయడంపై పట్టు సాధించాను’’ అని అంటారు లిలిత్‌.
  • మొదటిసారి టాటూను తన తండ్రి స్నేహితునికి వేసింది. ఆయన చేతిపై ఒక కార్టూన్‌ క్యారెక్టర్‌ వేయడానికి 90 నిమిషాల సమయం పట్టింది. కానీ టాటూ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. లిలిత్‌కు వరల్డ్‌ యంగెస్ట్‌ టాటూ ఆర్టిస్టుగానూ పేరుంది. 

Updated Date - 2021-04-08T05:03:05+05:30 IST