Jul 25 2021 @ 00:11AM

‘బిచ్చగాడు-2’తో దర్శకుడిగా...

బిచ్చగాడు’తో తెలుగునాట హీరోగా పేరు తెచ్చుకున్నారు తమిళ సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా కంటే హీరోగానే ఎక్కువసార్లు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ తెరకెక్కుతోంది. దీంతో విజయ్‌ ఆంటోనీ దర్శకుడిగా మారుతున్నారు. ‘‘దర్శకుల కుటుంబానికి స్వాగతం విజయ్‌ ఆంటోనీ. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ సినిమా పోస్టర్‌ను ఏఆర్‌ మురుగదాస్‌ విడుదల చేశారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు విజయ్‌ ఆంటోనీ తెలిపారు. ‘బిచ్చగాడు’ తమిళ మాతృక ‘పిచ్చైకారన్‌’ నిర్మించిన విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంస్థే సీక్వెల్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి భాష్యశ్రీ మాటల రచయిత.

Otherwoodsమరిన్ని...