‘సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యులది ముఖ్యభూమిక’

ABN , First Publish Date - 2021-01-19T06:18:53+05:30 IST

వ్యాపార, సేవారంగాల ద్వారా సమాజాభి వృద్ధికి ఆర్యవైశ్యులు ముఖ్యభూమిక పోషిస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌, ఎమ్మెల్సీ బోగ్గారపు దయానంద్‌, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు.

‘సమాజ అభివృద్ధిలో ఆర్యవైశ్యులది ముఖ్యభూమిక’
సమావేశంలో మాట్లాడుతున్న నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌

భువనగిరి టౌన్‌, జనవరి 18: వ్యాపార, సేవారంగాల ద్వారా సమాజాభి వృద్ధికి ఆర్యవైశ్యులు ముఖ్యభూమిక పోషిస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌, ఎమ్మెల్సీ బోగ్గారపు దయానంద్‌, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం భువనగిరిలో జరిగిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ, వాసవీక్లబ్‌ జిల్లా నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు మాట్లాడారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదన్నారు.  కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ మల్లగారి శ్రీనివాస్‌, బెజగం సంతోష్‌కుమార్‌, జగిని మధుసూదన్‌, చీకటిమల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T06:18:53+05:30 IST