బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో ముంబై హై కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఈ నెల రెండో తేదీన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం కానుంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించనున్నారు. అనిల్ గంటలోపే తన వాదనను పూర్తి చేస్తే ఈ రోజు ఈ పిటిషన్‌పై తీర్పు వచ్చేస్తుంది. ఆలస్యమైతే మాత్రం తీర్పు శుక్రవారానికి వాయిదా పడుతుంది.
శుక్రవారం కూడా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రాకపోతే అతను నవంబర్ 15 వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుంది. శనివారం, ఆదివారం కోర్టు సెలవులు. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి 12 వరకు దీపావళి సెలవులు రాబోతున్నాయి. 13, 14 శని, ఆదివారాలు కావడంతో కోర్టు ఉండదు. శుక్రవారం లోపు ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే తదుపరి విచారణ నవంబర్ 15నే ఉంటుంది. అప్పటి వరకు ఆర్యన్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది.