Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 21 Oct 2021 17:41:13 IST

Aryan Khan డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. బెయిల్ ప్రయత్నాలు చేస్తుండగానే ఆర్యన్ సహా ఎనిమిది మందికి..

twitter-iconwatsapp-iconfb-icon

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. బెయిల్ కోసం ఆర్యన్ తరుఫు లాయర్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. అదే సమయంలో అక్టోబర్ 30 వరకు ఆర్యన్ సహా మరో ఏడుగురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 1వ తేదీలోగా అంటే రానున్న వారం రోజుల్లో ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై బయటకు రాకపోతే అతడు నవంబర్ 14 దాకా లోపలే ఉండాల్సి వస్తుంది. హైకోర్టుకు దీపావళి సెలవులు మొదలైతే వచ్చే నెల 14 దాకా బెయిల్ దొరికే అవకాశాలు ఉండవు. కాబట్టి అంతలోపే షారుఖ్ తరుఫు లాయర్లు అన్ని విధాలుగా తమ శక్తియుక్తుల్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్యన్‌కు దీపావళి పండగ కూడా జైల్లోనే గడిచిపోతే అతడు దాదాపు 40 రోజుల పైబడి జైలు జీవితం గడిపిన వాడవుతాడు.

ఇదిలా ఉండగా.. సీనియర్ నటుడు చంకీ పాండే కుమార్తె అనన్య పాండే కూడా తాజాగా చిక్కుల్లో పడింది. ఆమె ఆర్యన్‌కు మంచి స్నేహితురాలని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఆర్యన్ ఫోన్ చాటింగ్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారట. ఈ నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న ఆమె ఇంటిపై ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యను ఆదేశించారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ తండ్రితో కలసి విచారణ నిమిత్తం ఎన్సీబీ ఆఫీస్‌కు చేరుకుంది. 


మరో వైపు, ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు కింగ్ ఖాన్‌కు తీవ్రమైన ఒత్తిడిగా మారుతోంది. మొదట మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ముంబైలోని ప్రత్యేక కోర్టులో కొద్ది రోజుల క్రితం లాయర్లు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. బుధవారం ఈ బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరిస్తున్నట్టు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆర్యన్ ఖాన్ తరపు లాయర్ హైకోర్టు మెట్లెక్కేందు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారులతో ఆర్యన్ ఖాన్‌కు నేరుగా సంబంధాలు ఉన్నాయనీ, బాలీవుడ్‌లో కొందరు వ్యక్తులకు, డ్రగ్స్ ముఠాకు ఆర్యన్ ఖాన్ మధ్యవర్తిగా ఉన్నాడనీ, లావాదేవీలు జరిపాడన్నది ఎన్సీబీ వాదన. ఓ వర్థమాన నటితో వాట్సప్ చాటింగ్‌కు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు ఎన్సీబీ సమర్పించింది.

ఈ కేసులో ఎన్సీబీ బలమైన వాదనలను వినిపించడంతో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించలేదన్నది నిపుణుల అభిప్రాయం. గురువారం ఉదయం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్‌ను 19 రోజుల తర్వాత షారూఖ్ ఖాన్ కలిసేందుకు వచ్చాడు. కుమారుడితో మాట్లాడి తిరిగి వెళ్లిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు ఆయన ఇంటిపై రైడ్ నిర్వహించారు. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ సన్నిహితురాలయిన అనన్య పాండే నివాసంలో కూడా దాడులు చేపట్టి.. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం అంతకంతకూ కలకలంగా మారుతోంది. చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement