Oct 28 2021 @ 18:50PM

Aryan Khan కు బెయిల్ వచ్చిన తర్వాత.. shah rukh khan ఫ్యామిలీలో వరుసగా మూడు సంబరాలు..!

ఆర్యన్ ఖాన్ అరెస్ట్, ఆ తరువాత వారాల తరబడి జైల్లో ఉండటం, ఎట్టకేలకు బెయిల్ లభించటం... అక్టోబర్ నెల మొత్తం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ చర్చే సాగింది. దేశ వ్యాప్తంగా సంచలనమైన ముంబై క్రుయిజ్ డ్రగ్స్ కేసు ప్రత్యేకంగా బీ-టౌన్‌కి పెద్ద షాక్‌గా పరిణమించింది. అయితే, బయటి వారంతా ఎంత ఫీలైనా ఆర్యన్ ఖాన్ తల్లిదండ్రులు షారుఖ్, గౌరీ మాత్రం గత పాతిక రోజులుగా జీవితంలో ఎప్పుడూ భరించనంత టెన్షన్ అనుభవించాల్సి వచ్చింది. ఇంటికి పెద్ద కొడుకైన వారసుడే జైల్లో ఉండటంతో ‘మన్నత్’ పూర్తిగా బోసిపోయింది... 


ముంబైలోని షారుఖ్ ఖాన్ నివాసం పేరు ‘మన్నత్’. వాళ్ల ఇళ్లు ఆ మహానగరంలో ఓ ల్యాండ్‌మార్క్. అటువంటి కింగ్ ఖాన్ ప్యాలెస్ దాదాపుగా అక్టోబర్ మొత్తం నీరసంగా, నిస్పృహతో దర్శనమిచ్చింది. అయితే, ఆర్యన్ ఎట్టకేలకు బెయిల్‌పై విడుదలవుతుండటంతో బాద్షా రాజసౌధం మరోసారి విందులు, వినోదాలకి సిద్ధం అవుతోంది. ముఖ్యంగా, నవంబర్ 2వ తేదీ, 4వ తేదీ, 13వ తేదీ ‘మన్నత్’ విద్యుత్ వెలుగులతో జిగేల్‌మనబోతోంది!


నవంబర్ 2న షారుఖ్ ఖాన్ బర్త్ డే. ఒకవేళ ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉండాల్సి వచ్చి ఉంటే అతడి జన్మదినం ఈసారికి నిశ్శబ్ధంగా ముగిసేది. అక్టోబర్ 8న ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ బర్త్ డే కూడా ఏ హడావిడి లేకుండానే గడిచిపోయింది. అక్టోబర్ 25న, మిష్టర్ అండ్ మిసెస్ ఖాన్, 30వ పెళ్లి రోజు వేడుక జరగాల్సింది. అది కూడా ఆర్యన్ ఖాన్ ఉదంతంతో ఎటువంటి సంబరాలు లేకుండా ముగిసింది. ఇక ఇప్పుడు షారుఖ్ 56వ జన్మదినం నవంబర్ 2న వచ్చేస్తోంది. తనయుడు బెయిల్‌పై ఇంటికి తిరిగి వచ్చేస్తాడు కాబట్టి ‘మన్నత్’లో షారుఖ్ బర్త్ డే గ్రాండ్‌గానే జరగవచ్చు... 


నవంబర్ 2 తరువాత వెంటనే, నవంబర్ 4న దీపావళి కూడా, షారుఖ్ కుటుంబం ఘనంగా జరుపుకోనుంది. బాలీవుడ్‌లో సెలబ్రిటీలందరూ ప్రత్యేక దివాలీ పార్టీస్ ఏర్పాటు చేసుకోవటం పరిపాటి. ఆర్యన్‌కు బెయిల్ లభించకపోయి ఉంటే అతను కోర్టులకు దీపావళి సెలవులు ముగిసేదాకా కారాగారంలోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు రిలీఫ్ దొరికింది కాబట్టి ‘మన్నత్’లో దీపావళి వెలుగులు, టపాసుల శబ్ధాలు ఫ్యాన్స్ ఆశించవచ్చు... 


నవంబర్ నెలలోనే, మరో ముఖ్యమైన రోజు కూడా ఉంది, ఖాన్ ఖాన్‌దాన్‌కి! గత పాతిక రోజుల్లో దేశ వ్యాప్త సంచలనమైన ఆర్యన్ ఖాన్ 13వ తేదీన జన్మించాడు. ఈ నవంబర్ 13తో 24 ఏళ్లు పూర్తవుతాయి. పెద్ద వివాదంలో చిక్కుకున్న షారుఖ్ వారసుడు ఈ యేడు ఎలాంటి సంబరాలు చేసుకుంటాడో, చూడాలి మరి! గ్రాండ్ బర్త్ డే బాష్ ఉంటుందో లేదో మనకు తెలియదుగానీ... ‘మన్నత్’లో మాత్రం... నవంబర్ 13 స్పెషల్ డేనే!

Bollywoodమరిన్ని...