Aryan Khan జైలులో నరకం అనుభవిస్తున్నాడు.. అతడి జీవితం ప్రమాదంలో ఉంది..

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం అతడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్ పిటిషన్ విచారణ 20వ తేదీకి వాయిదా పడింది. హృతిక్ రోషన్, సోమీ అలీ, రవీనా టండన్ తదితరులు ఇప్పటికే ఆర్యన్‌కు తమ మద్దతును ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలోకి మరొకరు కూడా చేరారు. బాలీవుడ్ సెలెబ్రిటీలపై తరచుగా విరుచుకుపడే సినీ విమర్శకుడైన కమల్ ఆర్.ఖాన్ కూడా తన మద్దతును తెలియజేశారు.

ఆయన ట్విటర్‌లో ఆర్యన్‌కు తన మద్దతును తెలిపారు. ‘‘ ఆర్యన్‌ను 20వ తేదీ వరకు జైలులో ఉంచడంలో ఎన్‌సీబీ విజయం సాధించింది. అతడు జైలులో నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతడి జీవితం ప్రమాదంలో పడింది. నా దీవెనలు ఎల్లప్పుడు అతడికి తోడుంటాయి ’’  అని వివరించారు. ఒక స్టార్ హీరో కొడుకు జైలులో ఉన్నప్పటికి బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉందని ఆయన గతంలో ప్రశ్నించారు. 


‘‘బాలీవుడ్ లో ఒక చిన్న ఫార్ములా ఉంది. సక్సెస్‌ఫుల్‌గా ఉన్న వారి వెంటే అది పరిగెడుతుంది. ప్లాప్‌లో ఉన్న వారిని ఎప్పుడు బాలీవుడ్ పట్టించుకోదు. అందువల్లే ఇమ్రాన్ ఖాన్, ఫైసల్ ఖాన్, హార్మన్ బావేజాలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కమర్షియల్‌గా సక్సెస్ అయిన వారి వెంటే బాలీవుడ్ పరిగెడుతుంది. బాలీవుడ్ అంత ఒక కుటుంబం అయితే ఆ ఇండస్ట్రీకి చెందిన వారు తప్పకుండా తమ మద్దతును తెలపాలి. హృతిక్ రోషన్ ఒక్కడే బహిరంగంగా తన మద్దతును తెలిపాడు. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, వరుణ్ దావన్, జూహీ చావ్లా, జావేద్ అక్తర్, పర్హన్ అక్తర్, ట్వింకిల్ ఖన్నా, కాజోల్ ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. బాలీవుడ్ లో ఎవరికి కూడా మిత్రులు, శత్రువులు ఉండరు ’’ అని కమల్ ఆర్.ఖాన్ వివరించారు. 


ఆర్యన్ ఖాన్ పై తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడంతో కంగనా రనౌత్‌ను ఆయన ప్రశంసించారు. ఆమె 98శాతం బాలీవుడ్ వాళ్ల కంటే మెరుగైందని చెప్పారు. ఆమె ఆర్యన్‌ను బహిరంగంగా విమర్శించిందని వెల్లడించారు. ఆమె మంచో, చెడో మాట్లాడిందని స్పష్టం చేశారు. అందరి లాగా మౌనం వహించలేదని పేర్కొన్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...