Oct 13 2021 @ 17:47PM

Aryan Khan బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారానికి(అక్టోబర్ 14) వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్ తరపున లాయర్ మొదట వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఎన్సీబీ తరపున అడిషనల్ సోలిసిటరల్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే సమాయాభావం వల్ల విచారణను గురువారానికి వాయిదా వేశారు. 


కాగా, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆర్యన్ బెయిల్‌ను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 13న విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఈ కేసులో ఆయనతో సహా దాదాపుగా 20మందికి పైగా అరెస్టు అయ్యారు. క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరిగిన సమయంలో 1000మందికి పైగా ఉండగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వీరిని మాత్రమే అరెస్టు చేశారని బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆరోపిస్తున్నారు. 


ఇప్పటికే  హృతిక్ రోషన్, సునీల్ శెట్టి, సోమీ అలీ, రవీనా టండన్, విశాల్ దడ్లానీ తదితరులు ఆర్యన్‌కు తమ మద్దతును తెలిపారు. ఈ కేసు విచారణ ప్రత్యేక కోర్టు ముందుకు అక్టోబర్ 13న వచ్చింది. షారూఖ్ మేనేజర్ పూజ దడ్లానీ, అతడి బాడీగార్డ్ రవి ఈ కేసు విచారణకు ఆర్యన్ తరపున సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. 

మేజిస్ట్రేట్ కోర్టు అక్టోబర్ 8న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ కేసు విచారణ అక్టోబర్ 13న ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చింది. ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని  ఎన్సీబీ లాయర్ వాదించారు. వాటిని వెలికి తీయాలంటే తమకు మరికొంత సమయం కావాలని అడిగారు. అందువల్ల బెయిల్‌ను ఇవ్వొదని చెప్పారు. ఎన్సీబీ ఈ కేసులో అద్భుతంగా పనిచేస్తోందని, కానీ ఒక వ్యక్తిని జైలులో ఉంచడం సరికాదని ఆర్యన్ తరపు లాయర్ వాదించారు. సమయభావం దృష్ట్యా కోర్టు ఈ కేసును అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Bollywoodమరిన్ని...