ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించం: సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-06-03T22:07:03+05:30 IST

న్యూఢిల్లీ: ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది.

ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది. వివాహ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ బాధ్యత కాదని, అధికారుల పని అని సుప్రీంకోర్టు తెలిపింది. 


ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారనే ఆరోపణలను వ్యతిరేకిస్తూ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన బీవీ నాగరత్న, అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపై 363, 366ఏ, 384, 384 సెక్షన్లతో పాటు పోక్సో కింద కూడా కేసు బుక్ అయింది. బాధితురాలు మైనర్ కాదని, మేజర్ అని, నిందితుడితో ఆర్యసమాజ్‌లో వివాహం కూడా అయిందని, అత్యాచారం ఆరోపణలు అవాస్తవమని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఆర్యసమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్‌ను గుర్తించబోమని, అసలైన సర్టిఫికెట్ ఎక్కడ అని ప్రశ్నించింది.    

Updated Date - 2022-06-03T22:07:03+05:30 IST