Jul 24 2021 @ 06:02AM

Arya: తండ్రి అయిన హీరో ఆర్య‌

కోలీవుడ్ హీరో ఆర్య తండ్ర‌య్యారు. 2019లో హీరోయిన్ స‌యేషా సైగ‌ల్‌(అఖిల్ సినిమా ఫేమ్‌)ను ఆర్య పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి శుక్ర‌వారంనాడు పాప పుట్టింది. ఈ విష‌యాన్ని ముందుగా హీరో విశాల్ త‌న ట్వ‌ట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. త‌ను మావ‌య్య అయ్యాన‌ని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. త‌న స్నేహితుడు ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడ‌ని ఈ సంద‌ర్భంగా విశాల్ అన్నారు. అలాగే అభిమానులు ఇండ‌స్ట్రీకి సంబంధించిన స్నేహితులు, ప్రముఖులు ఆర్య‌, స‌యేషా దంప‌తుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. గురువారం ఆర్య హీరోగా న‌టించిన సార్ప‌ట్ట ప‌రంప‌ర సినిమా అమెజాన్‌లో విడుద‌ల కావ‌డం విశేషం. 

త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కే కాదు, తెలుగు వారికి కూడా ఆర్య సుప‌రిచితుడే. అల్లుఅర్జున్‌ వ‌రుడు చిత్రంలో  ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. అలాగే సైజ్ జీరోలోనూ అనుష్క జోడీగా క‌నిపించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అవ‌న్ ఇవ‌న్ అనువాద వెర్ష‌న్ వాడు వీడు, ఇరాండాం ఉల‌గం త‌మిళ వెర్ష‌న్ వ‌ర్ణ వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కులను మెప్పించారు ఆర్య‌. అలాగే అఖిల్ అక్కినేని జ‌త‌గా అఖిల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన స‌యేషా.. పెళ్లి త‌ర్వాత కూడా కొన్ని సినిమాల్లో న‌టించారు.