Aug 4 2021 @ 15:38PM

అరవింద్ స్వామి చిత్రానికి మోక్షం..'వనంగమూడి' టీజర్ రిలీజ్

తమిళ నటుడు అరవింద్ స్వామి నటించిన చిత్రానికి మోక్షం లభించింది. దాదాపు నాలుగేళ్ళుగా విడుదలకి నోచుకోని ఈ చిత్రాన్ని త్వరలో రిలిజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం తాజాగా టీజర్ రిలీజ్ చేసింది. 2017లో సెల్వ దర్శకత్వంలో 'వనంగమూడి' చిత్రం మొదలైంది. ఇందులో అరవింద్ స్వామి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. రితికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నా ఈ మూవీని మ్యాజిక్ బాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గణేష్ రవిచంద్రన్ నిర్మించారు. డి ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఇంతకాలం రక రకాల కారణాల వల్ల ఆగిపోయిన ఈ చిత్రం అన్ని అడ్డంకులు తొలగించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా మణిరత్నం నిర్మాణంలో సిద్ధమవుతోన్న 'నవరస' వెబ్ సిరీస్‌లో నటించడమే కాకుండా.. ఒక విభాగానికి దర్శకత్వం కూడా చేశారు. 


Otherwoodsమరిన్ని...