Abn logo
Sep 25 2020 @ 16:23PM

ఎస్పీ బాలు మృతికి అర్వింద్‌కుమార్‌ దిగ్ర్భాంతి

Kaakateeya

హైదరాబాద్‌: సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ చలనచిత్ర అభివృది సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌కుమార్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్ధాలకు పైగా వివిధ జాతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసి , సుమారు 40వేల పాటలు ఆలపించిన బాలు భారతీయ ప్రజల అందరికీ అభిమాని అయ్యారని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ ప్రపంచానికి అందించిన సేవలు మరువలేనివని, సినీ సంగీత ప్రపంచంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement