న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తల జరిపిన విధ్వంసం ఘటనలో పోలీసులు 8 మంది నిందితులను గురువారం అరెస్ట్ చేశారు.దాడి కేసులో పాల్గొన్న మరికొంత మంది బీజేపీ కార్యకర్తల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు.ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.సీఎం ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయని, సీఎం ఇంటి చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ధ్వంసం చేశారని సమాచారం.కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఆప్ పేర్కొంది. సీఎం నివాసంపై దాడి అనంతరం ‘‘అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది’’ అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని మరో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆరోపించారు.కశ్మీరీ పండిట్ల ఊచకోత అబద్ధమని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలోని కార్యకర్తల బృందం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది.కేజ్రీవాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని యువమోర్చా డిమాండ్ చేసింది. వారు క్షమాపణ చెప్పే వరకు యువమోర్చా నిరసనలు కొనసాగిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి