ఢిల్లీలో కరోనా నియంత్రణలో ఉంది: అరవింద్ కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-08-24T00:47:29+05:30 IST

ఢిల్లీలో కరోనా నియంత్రణలో ఉంది: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా నియంత్రణలో ఉంది: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీలో కరోనా నియంత్రణలో ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రతి ఒక్కరి సహాయంతో ఢిల్లీలో కరోనాను కట్టడి చేయగలిగామని చెప్పారు. కరోనా కట్టడికి ఢిల్లీలో వ్యవహరించే విధానం పట్ల.. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. జూన్ 1 నుంచి క్రమంగా లాక్‌డౌన్ సడలింపులు ప్రారంభించామని తెలిపారు. దేశంలో లాక్‌డౌన్ మళ్లీ విధించని ఏకైక నగరం ఢిల్లీ మాత్రమేనని కేజ్రీవాల్ ప్రకటించారు.


మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,450 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ వ్యాప్తంగా 1,61,466కు కరోనా కేసులు చేరాయి. కరోనాతో 16 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 4,300 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఢిల్లీలో 11,778 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 1,45,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటివరకు 14.31 లక్షల టెస్టులు చేశారు.

Updated Date - 2020-08-24T00:47:29+05:30 IST