అలిగిన ఎమ్మెల్యే ‘అరూరి’

ABN , First Publish Date - 2021-05-08T05:48:50+05:30 IST

అలిగిన ఎమ్మెల్యే ‘అరూరి’

అలిగిన ఎమ్మెల్యే ‘అరూరి’

 డిప్యూటీ మేయర్‌ ఇవ్వలేదని అసంతృప్తి

హన్మకొండ టౌన్‌, మే 7: వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అలిగారు. తన నియోజకవర్గానికి చెందిన అభ్యర్థికి డిప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వకపోవడంతో అ రూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులకు అ వకాశం కల్పించలేదని, కనీసం ఈసారైనా డిప్యూటీ మేయర్‌ ఇవ్వాలని అధిష్ఠానా న్ని కోరినట్లు సమాచారం. తమ నియోజకవర్గానికి రెండో సారి కూడా మొండి చేయి చూపించడంతో అరూరి రమేష్‌ నేతల ముందు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఇండ్ల నాగేశ్వర్‌రావు (45వ డివిజన్‌), ఆవాల రాధికారెడ్డి (64వ డివిజన్‌) డిప్యూటీ మేయర్‌ కోసం ప్ర యత్నాలు సాగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సైతం తమ నియోజకవర్గానికి కనీసం డిప్యూటీ మేయర్‌ అవకాశం ఇవ్వాలని జిల్లా మంత్రిని, అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. రెండు రోజులుగా సాగిన చర్చల్లోనూ తమ నియోజకవర్గానికి డిప్యూటీ మేయర్‌ ఇవ్వాలని అరూరి పట్టబట్టినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం హరిత హోటల్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అరూరి తమ నియోజకర్గానికి డిప్యూటీ మేయర్‌ పదవి రావడం లేదని తెలుసుకుని మంత్రుల ముందు అసహనం వ్యక్తం చేసి బయటికి వెళ్లినట్టు తెలిసింది. భోజనానంతరం మరోసారి కార్పొరేటర్లతో జరిపిన భేటీకి అరూరి హాజరుకాలేదు. బయటికి వెళ్లిన అరూరి నేరుగా కార్పొరేషన్‌ ఆవరణలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రెండోసారి కూడా డిప్యూటీ మేయర్‌ పదవి కోరితే ఇవ్వకపోవడం సరికాదని, తమ సభ్యుల్లో అర్హులు లేరా అని ఆయన జిల్లా నేతలు, పార్టీ పరిశీలకులతో వాదించగా వారు అరూరిని వారించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

Updated Date - 2021-05-08T05:48:50+05:30 IST