ఆరూర్‌దాసుకు ‘కలైంజర్‌’ అవార్డు ప్రదానం

ABN , First Publish Date - 2022-06-04T15:39:03+05:30 IST

ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘కలైంజర్‌ స్మారక కళారంగ ప్రఙ్ఞాశాలి’ అవార్డు తొలి పురస్కారాన్ని ప్రముఖ తమిళ సినీ మాటల రచయిత ఆరూర్‌దా్‌సకు సీఎం స్టాలిన్‌ అందజేశారు.

ఆరూర్‌దాసుకు ‘కలైంజర్‌’ అవార్డు ప్రదానం

                   - స్వయంగా అందజేసిన సీఎం స్టాలిన్‌ 


చెన్నై: ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘కలైంజర్‌ స్మారక కళారంగ ప్రఙ్ఞాశాలి’ అవార్డు తొలి పురస్కారాన్ని ప్రముఖ తమిళ సినీ మాటల రచయిత ఆరూర్‌దా్‌సకు సీఎం స్టాలిన్‌ అందజేశారు. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఎస్‌.పి.ముత్తురామన్‌ సారథ్యంలోని త్రిసభ్య కమిటీ ఎంపికచేసిన ఈ అవార్డును దివంగత మాజీ ముఖ్యమంత్రి కలైంజర్‌ డాక్టర్‌ ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా శుక్రవారం టి.నగరులోని ఆరూర్‌దాస్‌ నివాసానికి ముఖ్యమంత్రి వెళ్ళి శాలువాతో సత్కరించి అవార్డును అందజేశారు. అలాగే రూ.10 లక్షల చెక్క కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేత, లోక్‌సభ సభ్యుడు టీఆర్‌ బాలు, మంత్రులు దురైమురుగన్‌, స్వామినాథన్‌ తదితరులున్నారు. అంతకుముందు ఆరూర్‌దాస్‌ నివాసానికి వచ్చిన సీఎంకు ఆయన కుమారుడు రామచంద్రన్‌ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఇదిలావుండగా 1958 సంవత్సరంలో దేవర్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన ‘వాళ్‌వైత్త దైవం’ అనే చిత్రానికి కథ, మాటలు సమకూర్చిన ఆరూర్‌దాస్‌ ఆ తర్వాత వెయ్యికిపైగా చిత్రాలకు కథ, మాటలను సమకూర్చారు. చివరగా హాస్య నటుడు వడివేలు నటించిన ‘తెనాలి రామన్‌’ చిత్రానికి మాటలు రాశారు. నాగపట్టణానికి ఈయన తన ప్రతిభతో సినిమా రంగంలో రాణించారు. అరింజ్ఞ్ఞర్‌ అన్నా, కలైంజర్‌ కరుణానిధి, డాక్టర్‌ ఎంజీఆర్‌, నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి సినీ దిగ్గజాలతో మంచి స్నేహసంబంధాలు కలిగిన అరూర్‌దా్‌సకు 2014లో సత్యభామ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

Updated Date - 2022-06-04T15:39:03+05:30 IST