దేశ జిమ్నాస్టిక్స్‌లో అరుణ దుమారం

ABN , First Publish Date - 2022-05-28T10:07:46+05:30 IST

తెలుగు జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి చేసిన ఓ ఆరోపణ ప్రస్తుతం దేశ క్రీడా రంగంలో సంచలనం రేపుతోంది. 2018 మెల్‌బోర్న్‌ వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగత పతకం (వాల్ట్‌లో కాంస్యం) సాధించిన

దేశ జిమ్నాస్టిక్స్‌లో అరుణ దుమారం

నా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ను వీడియో తీశారు

లేదన్న జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య

ఆధారాలున్నాయన్న తెలుగు అథ్లెట్‌

న్యాయపోరాటానికి హెచ్చరిక


న్యూఢిల్లీ : తెలుగు జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి చేసిన ఓ ఆరోపణ ప్రస్తుతం దేశ క్రీడా రంగంలో సంచలనం రేపుతోంది. 2018 మెల్‌బోర్న్‌ వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగత పతకం (వాల్ట్‌లో కాంస్యం) సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పిన అరుణ..తన అనుమతి లేకుండా తన శారీరక దారుఢ్య విశ్లేషణ పరీక్షను వీడియో తీశారని ఆరోపించింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) కోచ్‌ ఒకరు ఈ పని చేశారని ఆమె వెల్లడించింది. అయితే అరుణ శారీరక సామర్థ్య విశ్లేషణ పరీక్షకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (జీఎ్‌ఫఐ) వెల్లడించడంతో హతాశురాలైన అరుణ..తన పరీక్షను వీడియో తీసిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నానని ప్రకటించడం దుమారం రేపుతోంది. 


పరీక్ష ఇలా..: బాకులో జరిగిన జిమ్నాస్టిక్స్‌ ప్రపంచ కప్‌ను పురస్కరించుకొని..జీఎ్‌ఫఐ సూచన మేరకు ఢిల్లీలో జరిగిన శారీరక సామర్థ్య విశ్లేషణ పరీక్షకు కోచ్‌ మనోజ్‌ రాణా తో కలిసి అరుణ హాజరైంది. 10 నిమిషాల ఈ మొత్తం పరీక్షను కోచ్‌ రోహిత్‌ జైస్వాల్‌ దగ్గర శిక్షణ పొందుతున్న జిమ్నాస్ట్‌ ఒకరు వీడియో తీశారని అరుణ వెల్లడించింది. ఈ పరీక్ష అనంతరం అంబాలలో శిక్షణ శిబిరానికి వెళ్లిపోయిన అరుణ..తన వ్యక్తిగత ఆర్థోపెడిక్‌ డాక్టర్‌కు వీడియో చూపించి, ఆయన నుంచి పునరావాస సూచనలు తెలుసుకోవాలని భావించింది. దాంతో తనకు ఫిట్‌నెస్‌ పరీక్ష సందర్భంగా తీసిన వీడియోను పంపాలని జీఎ్‌ఫఐని కోరింది. అయితే అరుణకు జరిపిన శారీర సామర్థ్య విశ్లేషణ పరీక్షను వీడియో షూట్‌ చేయాలని తాము ఆదేశించలేదని జీఎ్‌ఫఐ అధ్యక్షుడు సుధీర్‌ మిట్టల్‌ ఆమెకు లేఖ రాశారు. మిట్టల్‌ జవాబుతో నివ్వెరపోయిన అరుణ.. జీఎఫ్‌ఐ అనుమతి లేకుండా ఓ మహిళా జిమ్నా్‌స్టను వీడియో తీయడం నేరమని, దానిపై తాను న్యాయస్థానానికి వెళ్లనున్నట్టు హెచ్చరించింది.


ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ..

అరుణ ఆరోపణలపై స్పందించిన సాయ్‌..ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. సాయ్‌ ఈడీ శ్రీమన్‌ ఆధ్వర్యంలోని కమిటీలో కోచ్‌ కమలేష్‌ తివాన, డిప్యూటీ డైరెక్టర్‌ కైలాష్‌ మీనా ఉన్నారు. 

Updated Date - 2022-05-28T10:07:46+05:30 IST