Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 18:24:25 IST

Breaking news: సినీ నటుడు నాజర్‌కు గాయాలు

twitter-iconwatsapp-iconfb-icon

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న నటుడు నాజర్(Nassar). ఓ తమిళ సినిమా షూటింగ్‌ చేస్తుండగా తాజాగా ఆయన గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. నాజర్ ఓ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పోలీస్ అకాడమీలో జరుగుతుంది. ఆ సమయంలో మెట్లపై నుంచి దిగుతుండగా ఆయన జారిపడ్డారు. ఫలితంగా గాయాల పాలయ్యారు. దీంతో చిత్ర బృందం సత్వరమే స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. వైద్యులు సాధారణ గాయమే అని తెలపడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమా షూటింగ్‌లో సుహాసిని, మెహ్రీన్ కౌర్, షాయాజీ షిండే తదితరులు పాల్గొంటున్నారు. యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ తో నాజర్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement