నాడు కళకళ.. నేడు వెలవెల

ABN , First Publish Date - 2022-07-06T06:01:01+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించడంతో పాటు ఐటీడీఏకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ప్రారంభించిన పండ్లతోటల పథకం

నాడు కళకళ.. నేడు వెలవెల
శిథిలావస్థకు చేరిన విశ్రాంతి గృహం

కనుమరుగైన పండ్ల తోటల పథకం 

జిల్లాలో ఆరు ఉద్యానవన కేంద్రాలు 

శిక్షణ కేంద్రాల ద్వారా గిరిజనులకు ఉపాధి

ఉట్నూర్‌, జూలై 5: ఉమ్మడి జిల్లాలోని గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించడంతో పాటు ఐటీడీఏకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ప్రారంభించిన పండ్లతోటల పథకం కనుమరుగైంది. ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రారంభంలోనే అప్పుడు ఉన్న ప్రాజెక్టు అధికారి పండ్లతోటల ఉధ్యానవన శిక్షణ  కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు ప్రయోజనం కల్గుతుందని భావించారు.  

ఐటీడీఏ ఆధ్వర్యంలో 6 కేంద్రాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆరు ఉధ్యాన వన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉట్నూర్‌లో 40ఎకరాలలో, ఆసిఫాబాద్‌ రాజంపేటలో 27ఎకరాలలో, బెల్లంపల్లిలో 110 ఎకరాలలో, కాగజ్‌నగర్‌ జంబుగాలో 86 ఎకరాలలో, భీమారంలో 17 ఎకరాలలో, బెల్లంపల్లి కన్నాలలో 300ఎకరాలలో పండ్ల తోటల ఉద్యానవన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ ఉధ్యాన వన కేంద్రంలో మామిడి తోట, సపోట తోట, జామ తోట లాంటి చెట్లను అభివృద్ధి చేసి ఆయా శిక్షణ కేంద్రాలకు ప్రతియేటా ఆర్థిక ఆదాయం వచ్చే లా కృషి చేశారు. అలాగే, ప్రతీ తోటకు ఒక ఉద్యాన వన అధికారితో పాటు ఐటీడీఏలో ప్రాజెక్టు హార్టికల్చర్‌ ఆఫీ సర్‌ను ఏర్పాటు  చేశారు. అదేవిధం గా సహాయ పండ్లతోటల అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తు తం అన్ని కేంద్రాలకు హార్టికల్చర్‌ అ ధికారులు లేకపోగా.. కిందిస్థాయి సి బ్బంది కూడా లేరు. కాగా ఉన్న ఉద్యోగులలో కొందరు ఉద్యోగ విరమణ చేయడంతో కొత్త నియామకాలు ఇప్పటి వరకు చేయనే లేదు. 

శిక్షణ కేంద్రాలతో ఉపాధి 

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉధ్యానవన శిక్షణ కేంద్రాలల పని చేయడానికి ఆయా ప్రాంతాల గిరిజనులను నియమించుకొనే వారు. అదేకాకుండా ఆయా ప్రాంతాలలో ఉన్న గ్రామీణ గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించడానికి పండ్ల తోటల పెంపకం, అంట్లుకట్టే విధానంపై శిక్షణ ఇచ్చేవారు. దీంతో గిరిజన ప్రాంతాల రైతులు పండ్లతోటల పథకంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉ ట్నూర్‌ ఉధ్యాన వన కేంద్రానికి ప్రతీయేటా పండ్లు విక్రయించడం ద్వారా, మొక్కలు అంట్లుకట్టి అమ్మడం ద్వారా సుమారు రూ.20 లక్షల వరకు సాలీన ఆదాయం వచ్చేది. అదేవిధంగా బెల్లంపల్లిలో రూ.10 లక్షల వరకు, జంబుగాలో రూ.15 లక్షల వరకు, భీమారంలో రూ.ఐదు లక్షల వరకు ఏడాదికి ఆదాయం వచ్చేది. ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న పండ్ల తోటలను తిలకించడానికి రాష్ట్రంలోని అధికారులు సైతం సందర్శించే వారు. గత 20ఏళ్లుగా ఐటీడీఏ ఉద్యా న వన కేంద్రాలపై నీలినీడలు సోకడంతో ప్రభుత్వం సైతం అదికారులను నియమించకపోవడంతో వచ్చిన ప్రాజెక్టు అధికారులు సైతం అంతగా శ్రద్ధ చూపక పోవడం గమనార్హం. దీంతో నాడు కలకలలాడిన పండ్లతోటల ఉద్యానవన శిక్షణ కేంద్రాలు.. ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలి వెలవెల బోతున్నాయి. ఇప్ప టికైనా ఉన్నతాధికారులు పండ్ల తోటల ఉద్యాన వన కేంద్రాల ద్వారా ఆర్థిక వనరులు పెంపొందించుకోవడంతో పాటు గిరిజనులకు శిక్షణలు ఇవ్వాలని జిల్లాలో ని గిరిజనులు కోరుతున్నారు. 

శిథిలావస్థలో విశ్రాంతి గృహం

ఉట్నూర్‌లోని ఉద్యాన వన కేంద్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన విశ్రాంతి గృహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉట్నూర్‌ పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఈ విశ్రాంతి గృహంలో బస చేసేవారు. అయితే, రెండు దశాబ్దాలుగా ఈ విశ్రాంతి గృహం ఆలనపాలనకు దూరం కావడంతో శిథిలావస్థకు చేరిందంటున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని స్థానిక గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధికి ప్రణాళికలు

: వరుణ్‌రెడ్డి, పీవో ఐటీడీఏ ఉట్నూర్‌ 

ఉట్నూర్‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పండ్ల తోటల ఉద్యానవన శిక్షణ కేంద్రాలను పునరుద్ధరించడానికి కృషి చేస్తాం. ప్రస్తుతం ఉన్న నిధులతో హెచ్‌ఎన్‌టీసీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సైతం రూపొందించి వాటిని తప్పకుండా అమలు చేస్తాం. జిల్లాలోని గిరిజనులందరికీ మేలు చేయడానికి ప్రయత్నిస్తాం. 

Updated Date - 2022-07-06T06:01:01+05:30 IST