Abn logo
May 22 2020 @ 11:05AM

8 ఏళ్ల తరువాత మ‌ళ్లీ హీరోయిన్‌గా క్రికెట‌ర్ భార్య‌

సిద్ధార్థ్ హీరోగా న‌టించిన ‘ఎన్‌.హెచ్ 4’ చిత్రంలో హీరోయిన్ అర్షిత శెట్టి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్షిత శెట్టి త‌ర్వాత మ‌రికొన్ని సినిమాల్లో న‌టించింది. ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు రాక‌పోవ‌డంతో సినిమాల‌కు దూర‌మైంది. 2019లో ఇండియ‌న్ క్రికెట‌ర్ మ‌నీష్ పాండేను పెళ్లి చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత  అర్షిత శెట్టికి తమిళంలో మళ్లీ ఛాన్స్‌ వచ్చింది. ‘రేణిగుంట’ ఫేమ్‌ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహిస్తున్న ‘నాందాన్‌ శివ’ చిత్రంలో అర్షిత హీరోయిన్‌గా నటిస్తోంది. కొత్త నటుడు వినోద్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. లాక్‌డౌన్‌కు ముందే చిత్రీకరణ పూర్తయ్యింది. కుంభకోణం, తిరుచ్చి పరిసరాల్లో షూటింగ్‌ జరిపారు. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement