స్మితా కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డ్రైవ్

ABN , First Publish Date - 2021-07-31T00:41:35+05:30 IST

హైదరాబాద్: కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సింగర్ స్మిత వ్యాక్సిన్ డ్రైవ్ మొదలుపెట్టారు.

స్మితా కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డ్రైవ్

హైదరాబాద్: కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సింగర్ స్మిత వ్యాక్సిన్ డ్రైవ్ మొదలుపెట్టారు. వ్యాక్సినేషన్‌ అవసరమైన వారికి అందుబాటులో ఉండాలనే సంకల్పంతో స్మితా కేర్ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ డ్రైవ్ మొదలుపెట్టారు. స్మిత పిలుపు అందుకున్న ఏఆర్ఎస్ సొలూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీనికి ఏర్పాట్లు చేసింది. తమ సంస్థ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేనేజింగ్ డైరెక్టర్ అనూరాధ రొండ్ల వ్యాక్సిన్ డ్రైవ్‌కు సహకరించారు. హైదరాబాద్‏లోని గోషామహాల్‏లో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. 1000కి పైగా వ్యాక్సిన్స్ కోసం విరాళం ఇచ్చారు. భవిష్యత్‌లో కూడా తమ సంస్థ ద్వారా మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్మితా కేర్ ఫౌండేషన్ ద్వారా విజయవాడలో ఇటీవల నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతమైంది. 

Updated Date - 2021-07-31T00:41:35+05:30 IST