గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

ABN , First Publish Date - 2022-05-22T05:54:32+05:30 IST

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రాలలోకి చిట్టీలు, పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని డీఈవో ఉషారాణి స్పష్టం చేశారు.

గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

ఫ రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు 

అన్ని ఏర్పాట్లు చేశాం 

ఫ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.ఉషారాణి 

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 21 : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రాలలోకి చిట్టీలు, పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని డీఈవో ఉషారాణి స్పష్టం చేశారు. శనివారం డీఈవో తన కార్యాలయంలోని విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 23  సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమ వుతున్నా యని, ఇందుకు సంబంధించి జిల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, పదో తరగతి పరీక్షలకు మొత్తం 13,321 మంది విద్యార్థులు హాజరు అవుతు న్నట్లు తెలిపారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 13,223 మంది ఉండగా, ప్రైవేట్‌ విద్యార్థులు 88 మం ది ఉన్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మఽధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతాయన్నారు. పరీ క్షల నిర్వహణకు గాను 59 సీఎస్‌లను,  59 మంది డీవోలను, 666 మంది ఇన్విజిలేటర్‌ను నియమించిన ట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి  అనుమ తించేదిలేదని చేప్పారు . విద్యార్థులు పరీక్ష కేంద్రా కుల పోవడం, రావడాని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం ఉం దని హాల్‌ టికేట్‌ చూ పించి ఉచితంగా ప్రయా ణించవచ్చని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్స్‌, వాచ్‌లు, ఇతర వస్తువులు అనుమతి లేదన్నారు. సీఎస్‌, డీవో, న్విజిలేటర్స్‌ కూడా సెల్‌పోన్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలవద్ద తప్పని సరిగా డీఈవో, ఎంఈవోల ఫోన్‌ నెంబర్‌తో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు, వైద్యసిబ్బంది ఉంటారని తెలిపారు. పరీక్ష కేంద్రావద్ద ఎలాంటి ఇబ్బందులు కల్గ కుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 08542 -241165, 08542- 252203 నెంబర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పరీక్ష విభాగం అధికారి వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:54:32+05:30 IST