వీఆర్‌ఏల అరెస్టులు సరికాదు

ABN , First Publish Date - 2022-05-22T05:01:08+05:30 IST

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం చలో హైదరాబాద్‌కు తరలివెళ్తున్న వీఆర్‌ఏలను అరెస్టు చేయడం సరైంది కాదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమ్ముల బాల్‌ నరసయ్య పేర్కొన్నారు.

వీఆర్‌ఏల అరెస్టులు సరికాదు

కొండపాక/మద్దూరు/కోహెడ/ములుగు/రాయపోల్‌/వర్గల్‌, మే 21: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం చలో హైదరాబాద్‌కు తరలివెళ్తున్న వీఆర్‌ఏలను అరెస్టు చేయడం సరైంది కాదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమ్ముల బాల్‌ నరసయ్య పేర్కొన్నారు. కుకునూరుపల్లి, త్రీ టౌన్‌ పోలీ్‌సస్టేషన్లకు నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి వీఆర్‌ఏలు ధర్నాకు వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకుని ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఏఎ్‌సఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. అరెస్టైన వారిలో కర్ణాకర్‌, రాజ్‌కుమార్‌, రాజయ్య, చంద్రమౌళి, సురేష్‌ ఉన్నారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌కు బయలుదేరుతున్న వీఆర్‌ఏలను కోహెడ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ములుగు మండల వీఆర్‌ఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం మండలాధ్యక్షుడు నీరుడి ఆంజనేయులు కార్యదర్శి నగేష్‌ మాట్లాడారు. వారి వెంట వీఆర్‌ఏలు నర్సింలు, కిరణ్‌, రాములు, జనార్ధన్‌, సాయిలు, రామకృష్ణ, వెంకటే్‌ష,తో పాటు తదితరులు ఉన్నారు. చలో హైదరాబాద్‌కు వెళ్తున్న రాయపోల్‌ మండల వీఆర్‌ఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చచేశారు. వర్గల్‌ మండలంలో పనిచేస్తున్న వీఆర్‌ఏలు సీసీఎల్‌ఏకు వెళ్లకుండా గౌరారం, బేగంపేట పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2022-05-22T05:01:08+05:30 IST