హిజాబ్ నిరసనల్లో నిందితులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-02-09T18:19:22+05:30 IST

కర్ణాటక హిజాబ్ వివాదంలో అరెస్టు అయిన నిరసనకారులు విద్యార్థులు కాదని వారు బయటి వ్యక్తులని రాష్ట్ర హోంశాఖమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు...

హిజాబ్ నిరసనల్లో నిందితులపై కఠిన చర్యలు

కర్ణాటక హోంశాఖ మంత్రి వెల్లడి అరగ జ్ఞానేంద్ర

బెంగళూరు : కర్ణాటక హిజాబ్ వివాదంలో అరెస్టు అయిన నిరసనకారులు విద్యార్థులు కాదని వారు బయటి వ్యక్తులని రాష్ట్ర హోంశాఖమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. బాగల్ కోట్ పట్టణంలో హిజాబ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో శివమొగ్గలో 144 సెక్షన్ ను విధించామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయమైన ఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి చెప్పారు.తమ పోలీసులు అరెస్టు చేసిన వారు బయటి వ్యక్తులని, వారు విద్యార్థులు కాదని తేలిందని హోంశాఖ మంత్రి చెప్పారు. హిజాబ్ విషయంలో తాము హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని హోంమంత్రి చెప్పారు.



బెంగళూరులోని విధాన సౌధలో బుధవారం కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.ఈ మంత్రివర్గ సమావేశంలో హిజాబ్ వివాదం గురించి మంత్రులు చర్చించారు.మంత్రివర్గ సమావేశానికి ముందు కర్ణాటక హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కలిశారు. హిజాబ్ నిరసనల సందర్భంగా రాళ్ల దాడి ఘటన, అనంతరం అరెస్టుల గురించి హోంశాఖ మంత్రి సీఎంకు వివరించారు.

Updated Date - 2022-02-09T18:19:22+05:30 IST