గంజాయి విక్రయిస్తున్న కూలీ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-11T16:46:45+05:30 IST

గంజాయి విక్రయిస్తున్న ఓ కూలీని కాచిగూడ పోలీసులు అరెస్ట్‌ చేశా రు. అడ్మిన్‌ ఎస్‌ఐ నాగరాణి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ బీరప్పగడ్డకు చెందిన జగదీష్‌ విజయ్‌కుమార్‌

గంజాయి విక్రయిస్తున్న కూలీ అరెస్ట్‌

హైదరాబాద్/బర్కత్‌పుర: గంజాయి విక్రయిస్తున్న ఓ కూలీని కాచిగూడ పోలీసులు అరెస్ట్‌ చేశా రు. అడ్మిన్‌ ఎస్‌ఐ నాగరాణి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ బీరప్పగడ్డకు చెందిన జగదీష్‌ విజయ్‌కుమార్‌ అలియాస్‌ విజ్జు(48) వృత్తి రీత్యా కూలీ. కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు రైల్వే స్టేషన్‌ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా జగదీష్‌ విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 50 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు నాగరాణి తెలిపారు. 

Read more