అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టు

ABN , First Publish Date - 2022-08-09T05:28:20+05:30 IST

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టు

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టు

 ఒకరి అరెస్టు... పరారీలో మరో ఇద్దరు..

రూ.52లక్షల విలువైన బంగారం, రెండు కార్లు స్వాధీనం

అపార్టుమెంట్లు, ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు

హనుమకొండ క్రైం, ఆగస్టు 8: అపార్టుమెంట్లు, ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగను వరంగల్‌ సీసీఎస్‌, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి  వివరాలను వెల్లడించారు. హరియాణ రాష్ట్రం బివాని జిల్లా భన్‌ఘర్‌ ప్రాంతానికి చెందిన పరమేందర్‌సింగ్‌ అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు నిందితులు సాదు, వపన్‌(ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లతో కలిసి దేశంలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.  

గుజరాత్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల్లో దొంగతనాలు చేసి అదే రోజు రైళ్లలో స్వస్థలానికి చేరుకుంటారు. పలుమార్లు జైలుకు వెళ్లి తిరిగి బెయిల్‌పై వచ్చారు. వీరు వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లోని కాజీపేట, మట్టెవాడ, కేయూ, హనుమకొండ, హసన్‌పర్తి పీఎ్‌సల పరిధిలోని అపార్టుమెంట్లు, ఇళ్ల తాళాలు పగులగొట్టి 12 చోరీలకు పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కోసం సీసీఎస్‌ విభాగానికి అప్పగించారు. సీసీఎస్‌ పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నా రు. వరంగల్‌ పోలీసులు బృందాలుగా వెళ్లి దొం గల కోసం వెతుకగా వారు వరంగల్‌లో ఉన్న ట్టు టవర్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించారు. 

జూలై 27న హనుమకొండలోని పెద్దమ్మగడ్డ నుంచి రెండు కార్లలో వస్తున్నట్టు పక్కా సమాచారం అందుకుని వాహనాలు తనిఖీ నిర్వహించారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా పరమేందర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగించారు. విచారణ కోసం సోమవారం కస్టడీకి తీసుకుని విచారించగా దాచిన బంగారాన్ని వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.52లక్షల విలువ గల 1033 గ్రాముల బంగారంతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దొంగతనాన్ని చేదించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌, అదనపు డీసీపీ పుష్ప, క్రైం ఏసీపీ డేవిడ్‌రాజు, హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు రమే్‌షకుమార్‌, శ్రీనివా్‌సరావు, శ్రీనివా్‌సజీ, ఏఏవో సల్మాన్‌పాషాతో పాటు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

 

Updated Date - 2022-08-09T05:28:20+05:30 IST