Arrest: మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-08-09T01:29:53+05:30 IST
పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ (Sridhar)ను బెల్లంకొండ పోలీసులు సోమవారం సాయంత్రం
బెల్లంకొండ: పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ (Sridhar)ను బెల్లంకొండ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ (Arrest) చేశారు. కొమ్మాలపాటి శ్రీధర్ నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వెడుతుండగా బెల్లంకొండ క్రాస్‌రోడ్డు వద్ద స్థానిక ఎస్ఐ సుధీర్ అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్టు విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొమ్మాలపాటి శ్రీధర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చివరకు సొంత పూచీకత్తుపై కొమ్మాలపాటి శ్రీధర్‌ను ఎస్సై సుధీర్ విడుదల చేశారు.