ముగ్గురు మున్సిపల్ ఉద్యోగుల అరెస్టు

ABN , First Publish Date - 2021-09-15T02:53:47+05:30 IST

నల్గొండ మున్సిపాలిటీలో అరెస్టుల పర్వం

ముగ్గురు మున్సిపల్ ఉద్యోగుల అరెస్టు

నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీలో అరెస్టుల పర్వం మొదలైంది. ముగ్గురు ఉద్యోగులను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్ చేసారు. మరికొందరు మున్సిపల్‌ ఉద్యోగులను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 2010-14లో ఆస్తిపన్ను, నల్లా బిల్లులు, ఇంటి అనుమతుల విషయంలో రూ.5 కోట్ల అవినీతికి 47 మంది సంబంధిత శాఖల ఉద్యోగులు పాల్పడ్డారు. 2015లో అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో ఈ కేసు సంచలనం సృష్టించింది. 2016లో 21 మంది ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసారు. 

Updated Date - 2021-09-15T02:53:47+05:30 IST