క్వారంటైన్‌ పాటించని రగ్బీ ఆటగాళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-04-07T09:52:46+05:30 IST

క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు ఫిజీ రగ్బీ ప్రొఫెషనల్‌ ఆటగాళ్లను అరెస్టు చేశారు. లండన్‌ క్లబ్‌ తరఫున ఆడుతున్న సెమీ కుటాని, మరో ఆటగాడు...

క్వారంటైన్‌ పాటించని రగ్బీ ఆటగాళ్ల అరెస్టు

సువా: క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు ఫిజీ రగ్బీ ప్రొఫెషనల్‌ ఆటగాళ్లను అరెస్టు చేశారు. లండన్‌ క్లబ్‌ తరఫున ఆడుతున్న సెమీ కుటాని, మరో ఆటగాడు సింగపూర్‌ మీదుగా ఫిజీ చేరుకున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల స్వీయ నిర్బంధాన్ని తప్పనిసరి చేశారు. కానీ, వీరిద్దరూ క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించి బయట తిరగడంతో పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2020-04-07T09:52:46+05:30 IST