పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-05-12T05:51:30+05:30 IST

మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ తిరుమల గార్డెన్‌లో పేకా ట ఆడుతున్న పలువురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి పక్క సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేసి పేకాట ఆడుతున్న 14మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. లక్ష 82 వేల770, 14 సెల్‌ఫోన్‌లు, ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటేశ్వర్‌లు తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

ఆర్మూర్‌టౌన్‌, మే11: మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ తిరుమల గార్డెన్‌లో పేకా ట ఆడుతున్న పలువురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి పక్క సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేసి పేకాట ఆడుతున్న 14మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. లక్ష 82 వేల770, 14 సెల్‌ఫోన్‌లు, ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటేశ్వర్‌లు తెలిపారు. 

మద్దుల్‌ అటవీ ప్రాంతంలో.. 

ధర్పల్లి: మండలంలోని మద్దుల్‌ అటవి ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణరెడ్డి బుధవారం తెలిపారు. ముం దుగా అందిన సమాచారం మేరకు మద్దుల్‌ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో పేకాట స్థావరంపై దాడిచేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి రూ. 3100 స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Read more