Abn logo
Aug 6 2021 @ 22:17PM

పేకాటరాయుళ్ల అరెస్ట్

ఖమ్మం: జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రుపాలెం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 17 మందిని అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి ఒక లక్షా 7వేల రూపాయల నగదు, 7 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.