పేకాట రాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-21T04:17:16+05:30 IST
మండలంలోని దన్నోర (బి)లో పేకాట అడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నాగనాథ్ తెలిపారు.
ఇంద్రవెల్లి, జనవరి 20: మండలంలోని దన్నోర (బి)లో పేకాట అడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నాగనాథ్ తెలిపారు. గ్రామ శివారులో పేకాడుతున్నట్లు వచ్చిన ముందుస్తు సమాచారం మేరకు పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి వారి వద్ద నుంచి రూ.9720 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.