Abn logo
Sep 24 2021 @ 23:52PM

‘ఇస్లాం ప్రబోధకుల అరెస్ట్టు అన్యాయం’

నిరసన తెలుపుతున్న ముస్లిం సంఘాల నాయకులు

నంద్యాల, సెప్టెంబరు 24: ఇస్లాం మత ప్రబోధకుడు మౌలానా ఖలీం సిద్ధిఖీని అరెస్ట్‌ చేయడం అన్యాయమని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇమామ్‌ల కౌన్సిల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అతా ఉల్లా ఖాన్‌, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ముస్తాక్‌ అహమ్మద్‌ అన్నారు. శుక్రవారం నంద్యాల గాంధీ చౌక్‌లో ఖలీం సిద్ధిఖీ అరె్‌స్టను నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఖలీం సిద్ధిఖీని అరెస్ట్‌ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. మత మార్పిడులు చేస్తున్నారని, విదేశీ ఫండింగ్‌ జరుగుతున్నదన్న ఆరోపణలు మోపడం తగదని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీపీఐ, పలు ముస్లిం మత పెద్దలు, భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.