అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

కొత్తూర్‌, జూలై 1: ఏపీలోని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను శుక్రవారం సాయంత్రం పట్టుకున్నట్లు ఏఎ్‌సఐ అబ్దుల్లా తెలిపారు. 59పశువులను డీసీఎం వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా హైదరాబాద్‌ శివారులో కొందరు బీజేపీ నాయకులు ఆ వాహనాన్ని వెంబడించారు. డ్రైవర్‌ ఆ వాహనాన్ని కొత్తూర్‌ నుంచి ఫాతిమాపూర్‌ వెళ్తుండగా స్థానిక బీజేపీ మండల అధ్యక్షుడు మల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి డీసీఎంను అడ్డుకొని నిలిపివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఏఎ్‌సఐ అబ్దుల్లా తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని డ్రైవర్‌ శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పశువులను పాల్మకుల సమీపంలోని జ్ఞానట్రస్టు  ఫౌండేషన్‌ గోశాలకు తరలించారు. వాహనంలో మొత్తం 59పశువులు ఉండగా, 37ఎద్దులు, 16ఆవులు ఉన్నాయని ఏఎ్‌సఐ తెలిపారు. వీటిలో ఆరు ఆవులు మృత్యువాతపడ్డాయని తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ తెలిపారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST