Abn logo
Sep 11 2021 @ 16:24PM

దొంగ నోట్ల ముఠా అరెస్ట్..

 హైదరాబాద్: నకిలీ 2000, 500 నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారన్నారు. నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. దొంగ నోట్లకి, ఒరిజినల్ నోట్లకు తేడా తెలుసుకోవాలని సీపీ సూచించారు.

క్రైమ్ మరిన్ని...