నలుగురు స్మగ్లర్ల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-09-19T05:01:41+05:30 IST

శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న న లుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి ఒక వాహనం, 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి రేంజర్‌ ఈరయ్య తెలిపారు.

నలుగురు స్మగ్లర్ల అరెస్ట్‌
ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లతో అటవీశాఖ అధికారులు

11 ఎర్రచందనం దుంగలు సహా వాహనం స్వాధీనం

సుండుపల్లె, సెప్టెంబరు18: శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న న లుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి ఒక వాహనం, 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి రేంజర్‌  ఈరయ్య తెలిపారు. శనివారం ఉదయం రాయవరం సెక్షన్‌ పరిధి ముడుంపాడు బీట్‌ ప్రాంతంజేసీ కుర్వపల్లె క్రాస్‌ దగ్గర చేస్తున్న తనిఖీలో భాగంగా సుమోను నిలిపేందుకు యత్నించగా వారు ఆపకుండా వెళ్లారన్నారు.

ఆ వాహనాన్ని అటవీ అధికారులు వెంబడించడంతో సు మో ప్రమాదానికి గురైందన్నారు. వెంటనే అటవీ అధికారులు వాహనాన్ని పరిశీలించ గా వాహనంలో రూ. 1,47,455 విలువైన 348 కిలోల 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఏలుమలై, అప్పదురై, అశోక్‌, రమ్యకుమార్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించి వాహనాన్ని సీజ్‌ చేసిన ట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వెంకటశేషయ్య, ఎఫ్‌బీఓ చెంగమ్మ, బేష్‌క్యాంప్‌, స్లైకింగ్‌ ఫోర్స్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T05:01:41+05:30 IST