వేలిముద్రల ఆధారంగా మహిళా దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో జరిగిన చోరీని మూడు రోజుల్లో బుక్కరాయసముద్రం పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఛేదించారు. మహిళా దొంగను

వేలిముద్రల ఆధారంగా మహిళా దొంగ అరెస్టు

బుక్కరాయసముద్రం, సెప్టెంబరు18: మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో జరిగిన చోరీని మూడు రోజుల్లో బుక్కరాయసముద్రం పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఛేదించారు. మహిళా దొంగను అరెస్టు చేసి, ఆమె నుంచి రూ.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న నాగేష్‌ ఇంట్లో ఈనెల 15వ తేదీన చోరీ చేశారు అదే రోజున ఇంటి సమీపంలోని గాయత్రి అనే మహిళ ఉదయం చీరలు కొనేందుకు వెళ్లింది.


ఆ సమయంలో బీరువాలో ఉన్న నగదును చూసింది. ఎలాగైనా నగదును అపహరించా లని పథకం రచించింది. నాగేష్‌ ఇంట్లో మధ్యాహ్నం ఎవరూలేని సమయంలో లోపలికి చొరబడి, బీరువాలో ఉన్న నగదును అపహరించించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.


చోరీ అయిన రోజు ఇంటికి వచ్చిన వారి వివరాలతోపాటు వేలి ముద్రలను సేకరించారు. గాయత్రి వేలిముద్రలు, చోరీ జరిగిన ప్రదేశంలోని వాటితో సరిపో లాయి. దీంతో ఆమెను పోలీసులు విచారించారు. చోరీ చేసినట్లు విచారణలో గాయత్రి అంగీ కరించింది. దీంతో శుక్రవారం అమెను అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST