Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రికెట్‌ బెట్టింగురాయుళ్ల అరెస్టు

లక్షెట్టిపేట, అక్టోబరు 14 : లక్షెట్టిపేట పట్ట ణంలో క్రికెట్‌పై బెట్టింగ్‌ చేస్తున్న పలువురిని టాస్క్‌ఫోర్స్‌  పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫో ర్స్‌ సీఐ ఏకే మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి పట్టణంలోని మార్కెట్‌ యార్డు ప్రాంతంలో జరిపిన దాడుల్లో ఢిల్లీ వర్సెస్‌ కోల్‌కత్తా ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌కు పాల్పడు తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసు కున్నామన్నారు. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన ఎంబడి మహేష్‌, పి.వినీత్‌, హనుమంత్‌పల్లికి చెందిన వెంకటేష్‌లను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి రూ.12 వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌కు పాల్పడిన మరో ముగ్గురు లక్షెట్టిపేటకు చెందిన పులగం నితీష్‌ అలియాస్‌ లడ్డు, దుమ్మాని వంశీ, జగిత్యాల జిల్లాలోని జానంపల్లికి చెందిన గణేష్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుకున్న నిందితులను లక్షెట్టిపేట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించామన్నారు. బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలన్నారు.  రామగుండం టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఏకే మహేందర్‌, ఎస్‌ఐ లచ్చన్న, లక్షెట్టిపేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంపత్‌కుమార్‌, భాస్కర్‌గౌడ్‌, శ్యాంసుందర్‌,  రాకేష్‌  పాల్గొన్నారు.  

Advertisement
Advertisement