బోర్‌వెల్‌ పైపు దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-19T06:09:51+05:30 IST

రూ.3.52లక్షల విలువైన బోర్‌వెల్‌ పైపులను దొంగిలించిన నలుగురు దోపిడీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

బోర్‌వెల్‌ పైపు దొంగల అరెస్టు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాష్‌

జగిత్యాల, అక్టోబరు 18: రూ.3.52లక్షల విలువైన బోర్‌వెల్‌ పైపులను దొంగిలించిన నలుగురు దోపిడీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో డీఎస్పీ ప్రకాష్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన వారణాసి ఉమామహేష్‌(23), సుందరయ్య కాలనీకి చెందిన పర్వతం విజయ్‌ కుమా ర్‌(25), వేంపల్లికి చెందిన కుంచెం నవీన(23), నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన ఆలకుంట అజయ్‌కుమార్‌ అలియాస్‌ అజితకుమార్‌(23) కమీషనపై బోర్‌వెల్‌ పైపులు సరఫరా చేస్తుండేవారు. ఈ నెల 4న మహారాష్ట్రకు చెందిన ‘గుడ్‌విల్‌ పాలి ఫాస్ట్‌’ కంపెనీకి నకిలీ చిరునామా, నకిలీ ఫోన నెంబర్‌తో రాజ బోర్‌ వెల్‌ ధర్మపురి పేరు మీద రూ.3,16,500 విలువైన 95 పీవీసీ బోర్‌ వెల్‌ పైపులు ఆర్డర్‌ చేశారు. ఆర్డర్‌ చేసిన పైపులను మహారాష్ట్రకు చెందిన రామ్‌ భోజ్నే అనే డ్రైవర్‌ వ్యానలో తెచ్చాడు. ఈ క్రమంలో వెల్గటూర్‌ మండలం అంబారిపేట వద్ద డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి ఓనర్‌తో మాట్లాడించారు. కాసేపటికి వ్యాన డ్రైవర్‌ చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి డ్రైవర్‌కు ఇచ్చిన నగదు, సెల్‌ఫోన లాక్కొని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వదిలిపెట్టి పారిపోయారు. వ్యాన డ్రైవర్‌ జరిగిన విషయం ఓనర్‌తో చెప్పి వెల్గటూర్‌ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. సీఐ కోటేశ్వర్‌ ఆధ్వర్యంలో పోలీసులు సోమవా రం రాజారాంపల్లి వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.


Updated Date - 2021-10-19T06:09:51+05:30 IST