కృష్ట జింకల వేటగాళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-10T00:32:18+05:30 IST

కృష్ట జింకలను వేటాడి చంపిన కేసులో వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. జూ పార్క్ వద్ద

కృష్ట జింకల వేటగాళ్ల అరెస్ట్

హైదరాబాద్ : కృష్ట జింకలను వేటాడి చంపిన కేసులో వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. జూ పార్క్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ముగ్గురు నిందితులను హైదరాబాద్ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక‌ కృష్ట జింకను చంపి దాని మాంసాన్ని వేటగాళ్లు విక్రయించారని ఆయన తెలిపారు. మరో జింకను వేటాడి పట్టుకెళ్తుండగా విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారని సీపీ పేర్కొన్నారు.  నిజామాబాద్‌ జిల్లాలో జింకలను వీరు వేటాడినట్లు సమాచారం అందిందిన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ అధికారులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేశామని ఆయన వివరించారు. 


నిందితుల నుంచి ఒక ఐ 20 కారును, ఒక‌ జింక కాళ్లు, తలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. శంకర్ బాబా, మహ్మద్ జుబేర్, మహ్మద్ సల్మానుద్దీన్ అనే ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మరొకరు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. వేటగాళ్ల బారినుంచి మూడేళ్ల కృష్ణ జింకను కాపాడామని సీపీ పేర్కొన్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నిందితులపై చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 

Updated Date - 2021-03-10T00:32:18+05:30 IST