FDల స్కామ్‌లో నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-22T20:46:14+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన FDల కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు

FDల స్కామ్‌లో నిందితుల అరెస్ట్

అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన FDల కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌లలో 14 కోట్ల FDలు గల్లంతయ్యాయి. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్చ చేసారు. FDల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన పలువురు బ్యాంక్ సిబ్బంది, ఇతర ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. 




ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధులు గల్లంతైన విషయం తెలిసిందే. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో, అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ఐవోబీ, సప్తగిరి బ్యాంకుల్లో ఎఫ్‌డీలను నిందితులు సొంత అకౌంట్లకు బదిలీ చేశారు.  అధికారుల ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గల్లంతైన సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఆయా బ్యాంకు యాజమాన్యాలు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు చేస్తామని తెలిపింది.


 కాగా, తెలంగాణ తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాహా చేసిన ముఠాయే ఏపీ ప్రభుత్వానికి చెందిన రెండు కీలకమైన సంస్థల్లో నిధులను కొల్లగొట్టారని గుర్తించారు పోలీసులు. ఈ మేరకు ఏపీ అధికారులకు తెలంగాణ సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. తెలుగు అకాడమీ స్కామ్‌లో నిధులను కొల్లగొట్టిన సాయి కుమార్ ముఠాయే ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌ల నుంచి రూ. 15 కోట్ల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు.

Updated Date - 2021-10-22T20:46:14+05:30 IST