వేర్వేరు హత్య కేసుల్లో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-01-24T04:18:38+05:30 IST

రెండు హత్య కేసుల్లో నిందితులను పోలీస్టు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నాగరాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు

వేర్వేరు హత్య కేసుల్లో నిందితుల అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు

ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు

ఒంగోలు(క్రైం), జనవరి 23 : రెండు హత్య కేసుల్లో నిందితులను పోలీస్టు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నాగరాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్తపట్నం మండలం కె.పల్లెపాలేనికి చెందిన ఐలా కోటిలింగం, అదే గ్రామానికి చెందిన కొక్కొలిగడ్డ పిచ్చయ్య ఇరువురు స్నేహితులు. పిచ్చయ్య వద్ద ఉ న్న బంగారపు ఆభరణాలు కాజేసి అప్పులు తీర్చుకుందామనే దురాశ కోటిలింగంలో కలిగింది. దీంతో ఈ నెల 14న పిచ్చయ్యను మద్యం తాగేందుకు పిలిచారు. ఇద్దరూ కలిసి ఈతముక్కల వెళ్లారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి ఆటో ఎక్కి సూరారెడ్డిపాలెం వైపు వెళ్లి సమీపంలో పెరాంటాళ్లకుంట వద్దకు చేరారు. అక్కడ ఇరువురు కలిసి మద్యం తాగారు. అనంతరం కోటిలింగం ముందుగా అనుకున్న ప్రకారం పిచ్చయ్యను మ ద్యం సీసాతో మోది హతమార్చాడు. అంతేగాకుండా అతడి వద్ద ఉన్న బంగారపు చైన్‌, రెండు డాలర్లు అపహరిచి పరారీ అయ్యాడు. అక్రమంలో పిచ్చయ్య భార్య తన భర్త కనిపించడం లేదంటూ కొత్తపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కోటిలింగం గ్రామ వీఆర్వో నున్నా సురేష్‌ వద్ద లొంగిపోయి తాను పిచ్చయ్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఒంగోలు టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవరావు  తన సిబ్బందితో శనివారం సాయత్రం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో టూటౌన్‌ సీఐ ఎం.రాఘవరావు, కొత్తపట్నం ఎస్సై ఫిరోజ్‌ఫాతిమా పాల్గొన్నారు.

యువకుడి హత్యాయత్నం కేసులో ఒకరు.. 

యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యయత్నానికి పాల్పడిన షేక్‌ రబ్బానీని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పోలంపాడు చెందిన రబ్బానీ అదే ప్రాంతానికి చెందిన తన బంధువు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కొంతకాలంగా ఒంగోలులో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో సత్యనారాయణపురంలో రబ్బానీ టీ దుకాణం నడుపుతున్నాడు. ఆయన దగ్గర సత్యనారాయణపురంలో నివాసం ఉండే కాశీకుమార్‌ టీ మాస్టర్‌గా చేరాడు. అనంతరం ఆ మహిళతో కాశీకుమార్‌ సంబంధం పెట్టుకొని తన వెంట తీసుకెళాడు. దీంతో రబ్బానీ కాశీకుమార్‌పై పగ పెంచుకున్నాడు. అంతేగాకుండా ఇందుకు సదరు మహిళ అన్న భార్య మీరాభీ, ఆమె కుమారుడు అక్బర్‌ఆలీ్‌ఫలు సహకరించారని మనస్సులో పెట్టుకుని ఎలాగైన వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం కలిగిరి మండలం అంబటవారిపాలెంలో ఉన్న మీరాభీ, అక్బర్‌ఆలీ్‌ఫలను ఉదయం 9 గంటలకు హత్య చేసి బైక్‌పై ఒంగోలు వచ్చాడు. పాతగుటూరు రోడ్డులో కాపు కాచి కాశీకుమార్‌పై హత్యాయత్నం చేశాడని డీఎస్పీ తెలిపారు. స్థానిక మంగమ్మ కళాశాల సమీపంలో నిందితుడిని తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:18:38+05:30 IST