Hyderabadలో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-28T22:12:56+05:30 IST

హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు.

Hyderabadలో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు  సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. శనివారం పురాని హవేలీ, సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. కరుడుగట్టిన చైన్ స్నాచర్  ఫైసల్ షా అలీ జబ్రితో పాటు రిసీవర్ ఖలీల్‌ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫైసల్ షా అలీపై గతంలో శాలిబండ, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల్లో మూడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఫైసల్ షా అలీ జబ్రిని అరెస్ట్‌తో మూడు చైన్ స్నాచింగ్ కేసులు చేధించినట్లు చెప్పారు.

నిందితుల నుంచి లక్ష80వేల రూపాయల విలువ చేసే 120 గ్రాముల గోల్డ్ చైన్ & ఒక పల్సర్ బైక్ సీజ్ చేశామన్నారు.ఈ నెల 21న శాలిబండ ప్రాంతంలో సుజాత అనే ప్రైవేట్ టీచర్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో  ఫైసల్ షా అలీ జబ్రి పుస్తెల తాడు లాకెళ్లాడని చెప్పారు.ఫైసల్ షా అలీ జబ్రికి 2006 నుంచి నేర చరిత్ర ఉందన్నారు. ఫైసల్ షాపై ఆయా పోలీస్ కమిషనరేట్ పరిధిల్లో 135 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.గతంలోనూ రెండు సార్లు పీడీ యాక్ట్ పై జైల్‌కి వెళ్లాడన్నారు. జైల్ నుంచి ఫైసల్ షా విడుదల కాగానే  రిసీవర్ ఖలీల్ ఇద్దరు కలిసి మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారని చెప్పారు. ఫైసల్ షా అలీ జబ్రి & ఖలీల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు.

Updated Date - 2022-05-28T22:12:56+05:30 IST