Abn logo
Sep 26 2021 @ 00:23AM

బంగారం దొంగతనం కేసులో ముగ్గురి అరెస్టు

బ్యాంక్‌లోని బంగారం దొంగతనం కేసులో నింధితులను అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టిన బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు

6 కేజీల బంగారం స్వాధీనం

బాపట్ల, సెప్టెంబరు 25: స్థానిక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బాపట్ల బ్రాంచ్‌లో  బంగారం దొంగతనం కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. బాపట్లలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.2 కోట్ల 36 లక్షలు ఉంటుందన్నారు. దొంగతనానికి పాల్పడిన సబ్‌స్టాఫ్‌ పేరలి సుమంత్‌, అతని స్నేహితులు ఉన్నం అశోక్‌కుమార్‌, కిషోర్‌ను అరెస్టు చేశామన్నారు. వీరిని కోర్టుకు హాజరు పరుస్తామన్నారు.  సమావేశంలో పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు రఫీ, వెంకటప్రసాద్‌ ఉన్నారు.