విగ్రహాలపై యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం

ABN , First Publish Date - 2021-01-14T05:46:56+05:30 IST

దేవుడి విగ్రహాలు ఫేక్‌... నేను ఎన్నో విగ్రహాలను నా చేతులతో ధ్వంసం చేశాను అని పాస్టర్‌ ప్రవీణ్‌ పేరుతో యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన పోస్టింగ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు కాకినాడకు చెందిన సోడదశి ప్రవీణ్‌చక్రవర్తి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

విగ్రహాలపై యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం

నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు

గుంటూరు, జనవరి 13 : దేవుడి విగ్రహాలు ఫేక్‌... నేను ఎన్నో విగ్రహాలను నా చేతులతో ధ్వంసం చేశాను అని పాస్టర్‌ ప్రవీణ్‌ పేరుతో యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన పోస్టింగ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు కాకినాడకు చెందిన సోడదశి ప్రవీణ్‌చక్రవర్తి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ వీడియో క్లిప్పింగ్‌పై నగరానికి చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ కేసులో  అదనపు ఎస్పీ పాల్‌ పర్యవేక్షణలో సీఐడీ అధికారులు బుధవారం నిందితుడు ప్రవీణ్‌చక్రవర్తిని డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.  


Updated Date - 2021-01-14T05:46:56+05:30 IST