విద్యార్థులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-05-29T07:15:12+05:30 IST

Arrangements should be made to attract students

విద్యార్థులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌టౌన్‌, మే 28 : మనఊరు - మనబడి ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యార్థులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. శనివారం మనఊరు - మనబడి కార్యక్రమంపై కలెక్టర్‌ సమావేశహాల్‌లో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సంబంధిత అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మా ట్లాడుతూ... మనఊరు - మనబడి ప్రణాళిక కార్యక్రమం కింద చేపడుతున్న 12 అంశాలలో ప్రాధాన్యత గల పనులను చేపడుతూ పాఠశాల విద్యార్థు లను ఆకర్షించే విధంగా పెయింటింగ్స్‌ వేయించాలని, క్రీడామైదానం ఏర్పాటు చేయాలని, బడి రూపురేఖలు మార్చాలని అన్నారు. గోడలకు రంగులు వే యించాలని, ఫ్లోరింగ్‌ పనులు శుభ్రంగా ఉండాలని, విద్యుదీకరణ లోపాలను సవరింపజేయాలని, తలుపులు పటిష్టంగా ఉండాలని, పచ్చదనంతో పాఠ శాల ఆవరణ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అన్నారు. బడి అవసరాలను గుర్తించేందుకు మండలానికి ఒక ప్రత్యేకఅధికారిని నియమించాలని అన్నా రు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్‌బోర్కడే, పి. రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్‌, డీఈవో రవీందర్‌, ఈఈపీఆర్‌ శంకరయ్య, ఆర్‌ అండ్‌ డబ్ల్యూ అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.  

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

భైంసా, మే 28 : ప్రభుత్వ నిబంధనల మేరకు అనధికార ఇంటిస్థలాల క్రమబద్దీకరణ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ముషా రఫ్‌ ఆలీ ఫారూఖీ అన్నారు. శనివారం పట్టణంలోని ఓవైసీనగర్‌లో ప్రత్యేక బృందం చేస్తున్న సర్వేను అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ప్రస్తుతం జారీ చేసిన 58, 59 జీవో ప్రకారం సర్వే చేపట్టాలని, ఇంటి యాజమాని నిర్మించిన భవనాలు, కొలతలు సేకరించ డంతో పాటు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌ యాప్‌లో పొందుపర్చాలని సూ చించారు. దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, ఆర్డీఓ లోకేశ్వర్‌రావు, తహసీల్దార్‌ సూర్యప్రకాష్‌, అధికారులున్నారు.

క్రీడాప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ 

భైంసా రూరల్‌, మే 28 : మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామంలో శనివారం క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నందు క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలన్నారు. యువతకు మానసిక, శారీరకఉల్లాసం ఉంచేందుకే క్రీడాప్రాంగణం ఎంతో అవసరమని తెలిపారు. విద్యతో పాటు ఆట పాటలు అవసరమేనని సూచించారు. గ్రామీణ ప్రాంతా ల్లో క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయిలో క్రీడలలో పాల్గొనాలని ఆశిస్తు న్నాము. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యాన్ని పరి శీలించి రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధి కారులకు సూచించారు. పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎంపీడీవో గంగాధర్‌, ఎంపీవో హుస్సేన్‌, ఏపీవో శివలింగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు గణేష్‌, రామ న్న, ఉప సర్పంచ్‌ ఈశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు. 

కుభీర్‌ మండల కేంద్రంలో కలెక్టర్‌ పర్యటన

కుభీర్‌, మే 28 : మండల కేంద్రంలో శనివారం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ పర్య టించారు. మండల కేంద్రంలో గత 35 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను కాలనీని పరిశీలించారు. జీవో 58 ప్రకా రం ఇళ్లస్థలాలు కొలతల ప్రక్రియను ఇప్పటి వరకు కొలతలను చేపట్టి ఇండ్లతో పాటు పలు వివరాలను తహసీల్దార్‌ విశ్వంబర్‌, ఎంపీడీవో రమేష్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జేసీ హెమంత్‌ బోర్కాడే నాయకులు విజయ్‌కుమార్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-05-29T07:15:12+05:30 IST