Abn logo
Jan 15 2021 @ 23:36PM

వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయాలి


అధికారులు అన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి  

కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 15 : జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ అధికారికంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యాక్సిన్‌ ప్రారంభోత్సవానికి ఎంపిక చేసిన నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, బోధన్‌ ఏరియా ఆసుపత్రి, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌, మా క్లూర్‌ ఆరోగ్య కేంద్రాల అధికారులతో ఆయన మాట్లాడారు. కోట్ల మంది ప్రజల కష్టాలకు, దుఃఖాలకు, లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఈనెల 16న వ్యాక్సిన్‌ను ప్రారంభించేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేయాలన్నారు. పది నెలలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులను, అసౌకర్యానికి గురిచేసిన ఈ వ్యాధిని అంతమొందించేందుకు దేశంలోనే తయారుచేసిన వ్యాక్సిన్‌ను ప్రారంభించేందుకు ఆరు కేంద్రాల్లో అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు అవకాశం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆరు కేంద్రాక్ష్‌ల్లో వెయిటింగ్‌ రూంలు విశాలంగా ఉండే విధంగా, అక్కడికి వచ్చే వారు, వీఐపీలు, అధికారులు కూర్చునే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. టీవీతో పాటు కేబుల్‌ కనెక్షన్‌, చుట్టుపక్కల పరిశుభ్రత వాతావరణం, తాగునీరు, శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు   పాటిస్తూ  ప్రతి ఒక్కరూ చూడాలని అన్ని కేం ద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా జరగాలన్నా రు. టాయిలెట్‌లు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కనీసం 10 పడకలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. కంప్యూటర్‌తో పాటు నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయాలని, రెండో గదిలో వ్యాక్సిన్‌ వేయడానికి, మూడో గదిని అబ్జర్వేషన్‌కు కేటాయించాలన్నారు. లబ్ధిదారుల మ్యానువల్‌  జాబితా సిద్ధం చేసుకోవాలని వారంతా కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఒక్కో వాయిన్‌లో పది డోసుల వ్యాక్సిన్‌ ఉంటుందని అందుకు సమానంగా మూడు వాయిన్‌లకు  అదనంగా మరో వాయిన్‌ను సరఫరా చేయాల ని తప్పనిసరయితేనే నాలుగో వాయిన్‌ తెరవాలని అ యితే అందుకు కారణాలను తెలపాల్సి ఉంటుందన్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు దేశ ప్ర ధాని ప్రజలనుద్దేశించి సందేశం ఇస్తారని, అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించాలని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమించబడ్డ జిల్లా స్థాయి అధికారులు ఈ ప్రారం భోత్సవ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని అందరూ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్‌ కేంద్రానికి పూర్తి బాధ్యుడిగా వ్యవహరించి అన్ని సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా సంబంఽఽధిత అధికారిపై చర్యలు తప్పవన్నారు. ఆర్డీవోలు సదుపాయాలపై ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ప్రోటోకాల్‌ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమం జరిగేలా చూడాలని ప్రతీ ఒక్కరూ  ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేసి వారిని ఆహ్వానించి కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఎక్కడ కూడా కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించకుండా చూడాలన్నారు. ఈ సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో సుదర్శన్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. 

కంట్రోల్‌ రూం ప్రారంభం 

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 15: జిల్లాలో కరోనా వ్యాక్సినైజేషన్‌ను శనివారం నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ఏమైనా సమస్యలు, ఫిర్యాదులపై జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను శుక్రవారం కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రారంభించారు. వ్యాక్సినైజేషన్‌కు సం బంధించి ప్రజలు నిజామాబాద్‌ 83092 19718, బోధ న్‌ 08467-222001, ఆర్మూర్‌ 08463-295050 నెంబర్‌లకు  ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

ఏర్పాట్ల  పరిశీలన

పెద్దబజార్‌, జనవరి 15 : కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నందున కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. గురు,శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్ప త్రి, వైద్య కళాశాలలో పర్యటించారు. అనంతరం 16న ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ పంపిణి కార్యక్రమం సందర్భంగా నిర్వహించే కార్యక్రమం సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 16న ఆరు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించామని, ప్రతీ కేంద్రంలో మొదటి రోజు 30మంది చొప్పున వ్యాక్సిన్‌ వేయనున్నామన్నారు. 18నుంచి 42 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ముందుగా జిల్లాలో గల సుమారు 15వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు, సిబ్బంది ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్‌కు అవసరమైన శిక్షణ ఇతర కార్యక్రమాలు పూర్తి చేశామని వివరించారు. కలెక్టర్‌ వెంట వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిర, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, పాల్గొన్నారు. 

Advertisement
Advertisement