నులిపురుగుల మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2020-09-22T05:52:14+05:30 IST

నులిపురుగుల మాత్రల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. సోమవా రం కలెక్టరేట్‌

నులిపురుగుల మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ భారతి హొళికేరి


మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 21 : నులిపురుగుల మాత్రల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. సోమవా రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూల నతో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, అక్టోబర్‌ 5 నుంచి 12వ తారీఖు వరకు నులిపురుగుల ని వారణ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. క్షేత్రస్థాయులో అధికారులకు ముం దస్తుగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఈనెల 21 నుంచి 25 వరకు, మండల స్థాయిలో 25 నుంచి 29 వరకు శిక్షణ అందిస్తు న్నామన్నారు.


కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మం దులపై అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లల కు ఆల్బెండజోల్‌ మాత్రలు అందజేయాలన్నారు. జిల్లాలో 1,82,587 మంది 2 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలున్నారని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ నీరజ, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ సప్తర్‌ అలీ, డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి, సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌  ఫయాజ్‌ఖాన్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T05:52:14+05:30 IST